AP Free Gas Cylinder Scheme 2024 is launched by the Government of Andhra Pradesh as a part of Super 6 Election Guarantee. Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu, launched this on the occasion of Diwali for the residents of Andhra Pradesh. Residents of Andhra Pradesh need not to register or AP Gas Free Cylinder Apply Online. Those whose family is having Gas Connection with White Ration Card, Aadhaar Card and Gas Connection with working mobile number can get the AP Free Gas Cylinder Scheme 2024. For more details, visit www.employmentsamachar.in
అర్హులైన వారందరికీ ‘ఉచిత గ్యాస్’ – మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఇంటికీ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను పం పిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మం త్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లా డారు. ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డుల అర్హతే ప్రామాణికంగా పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఏపీలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు రూ.2,684.75 కోట్లు ప్రాథమిక ఖర్చుగా అంచనా వేసినట్లు చెప్పారు. ఈ నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ ప్రారంభించి, 31న ఇంటింటికీ డెలివరీ చేస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసేలా ఆయిల్ కంపెనీలు అంగీకరించాయన్నారు. ఐదేళ్లలో రూ.13,423 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
గ్యాస్ బుకింగ్ చేసుకున్న వెంటనే లబ్ధిదారుడి ఫోను ‘ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం వర్తించింది’ అంటూ సందేశం వెళ్తుందన్నారు.గ్యాస్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాలో నేరుగా రాయితీ సొమ్ము జమ చేస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 31లోగా మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవచ్చన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏప్రిల్-జూలై, ఆగష్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలల్లో 3 సిలిండర్లను ఉచితంగా పొందవచ్చని వివరించారు. లబ్ధిదారులకు సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని కోరారు. పథకం అమల్లో భాగంగా ఆయిల్ కంపెనీలకు అడ్వాన్స్ రూ.894.92 కోట్లను 29 అక్టోబర్ 2024 న అందజేస్తామన్నారు.
దీపం పథకం అర్హతలు
దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు పొందేందుకు అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి
- బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారై ఉండాలి
- తెల్లరేషన్ కార్డులు కలిగి ఉండాలి
- గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి