AP Anganwadi Recruitment 2024 is released for the Prakasam District for 108 posts. For 12 ICDS Project Offices in Prakasam District, the available posts are going to be recruited by accepting the Offline AP Anganwadi Applications 2024 from the eligible candidates. సొంత ఊరిలో ఉంటూ ఉద్యోగము చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త , అంగన్వాడి సహాయకురాలు , మినీ అంగన్వాడి కార్యకర్త అనే ఉద్యోగాలను పదో తరగతి అర్హత గల వారితో భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు అర్హులు. వివాహిత మహిళలకు ఇది చక్కని అవకాశం. తాజాగా విడుదలైన AP Anganwadi Recruitment 2024 Notification ద్వారా మొత్తం 108 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
AP Anganwadi Recruitment 2024
Name Of The Company | Integrated Child Development Services |
Post Names | అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకులు |
Number Of Openings | 108 |
Registration Procedure | Offline |
Job Location | Prakasam District, Andhra Pradesh |
Category | Employment News |
Applications Submission Dates | 11th to 23rd December 2024 |
Official Website | prakasam.ap.gov.in |
ఈ AP Anganwadi Recruitment 2024 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి.
Prakasam District Anganwadi Vacancy
- అంగన్వాడి కార్యకర్త: 15 Posts
- మినీ అంగన్వాడి కార్యకర్త: 04 Posts
- అంగన్వాడి సహాయకులు: 89 Posts
ఉండవలసిన అర్హతలు
అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు , మినీ అంగన్వాడి కార్యకర్త ఉద్యోగాలకు 10th అర్హత ఉన్న వారు అర్హులు.
కనీస వయస్సు
కనీసం 21 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు (01-12-2024 నాటికి)
గరిష్ట వయస్సు
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాల (01-12-2024 నాటికి)
జీతం ఎంత ఉంటుంది
- అంగన్వాడి కార్యకర్తకు – 11,500/-
- మినీ అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకులకు – 7,000/-
ఎంపిక విధానం ఎలా ఉంటుంది
10వ తరగతిలో వచ్చిన మార్కులు, ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
పరీక్ష విధానం
ఈ ఉద్యోగాల ఎంపికలో పరీక్ష లేదు, ఇంటర్వ్యు మాత్రమే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఫీజు
ఫీజు లేదు
అప్లికేషన్ విధానం
అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి.
ఎలా అప్లై చెయాలి
అర్హత గల వారు తమ బయో డేటాతో పాటు అన్ని విద్యార్హతలు మరియు ఇతర సర్టిఫికెట్స్ Xerox Copies పైన Gazetted ఆఫీసర్ తో అటెస్టేషన్ చేయించి ICDS Project ఆఫీస్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ కు జతపరచల్సిన సర్టిఫికెట్స్
- పుట్టిన తేది / వయస్సు ధృవీకరణ పత్రం
- కుల ధృవీకణ పత్రం
- విద్యార్హత ధ్రువీకరణ పత్రము – SSC మార్కుల లిస్ట్ , TC మరియు SSC కంటే చదివిన వారు దాన్ని మార్క్ లిస్ట్ మరియు TC జతపరచవలెను.
- నివాస స్థల ధ్రువీకరణ పత్రము
- వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
- వికలాంగులైనచొ పీహెచ్ సర్టిఫికెట్
- వితంతువు అయినచో పిల్లలు ఉన్నట్లయితే పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు