For AP Grama Ward Sachivalayam Employees Transfers, the Government of Andhra Pradesh has released the advertisement. Rules, dates, procedure are also specified below clearly. www.employmentsamachar.in has come forward to inform the things in detail. So, all the AP Grama Ward Sachivalayam Staff must know these updates regarding AP Grama Sachivalayam Employees Transfers Latest News and apply as per the format. For more details, visit gramawardsachivalayam.ap.gov.in/GSWS/.
ప్రజలకు ప్రభుత్వ పాలనను అత్యంత చేరువ చేసే నేపథ్యంలో వైఎస్ జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తూ అత్యంత ప్రజా దరణ పొందిన విషయం విదితమే. అయితే ప్రస్తుత చంద్రబాబునాయుడి ప్రభుత్వం సచివాలయ ఉద్యో గుల బదిలీలకు సైతం రంగం సిద్ధం చేసింది. బదిలీలు కోరుకునే ఉద్యోగులు తమ వివరాలతో ఆన్లైన్ విధానంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలంటూ ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల (ఆగష్టు) 31వ తేదీలోగా వివిధ శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి తెలిపిన నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేశారు.
అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఒకేచోట ఐదేళ్ల పాటు పనిచేస్తున్న వారికి తప్పనిసరి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయగా మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు జరిగి ఇంకా ఐదేళ్లు పూర్తి కాని నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు అవకాశం లేకుండా పోయింది. అయితే, నిర్ణీత నిబంధనల మేరకు బదిలీ కావాలని కోరుకునే వారికి బదిలీలకు అవకాశం కల్పించడంతో పాటు అత్యవసర పరిపాలన అవసరాల రీత్యా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ఆయా జిల్లా పరిధిలోని ఏ సచివాలయానికైనా బదిలీ చేసే అవకాశం ఉంటుందని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
మార్గదర్శకాలి:-
- ఆ బదిలీ కోరుకునే ఉద్యోగులు ఆన్లైన్లో ఈ నెల (ఆగష్టు) 27లోగా దరఖాస్తులు చేసుకోవాలి.
- దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు సం బంధిత ఉమ్మడి జిల్లాల పరిధిలో వేర్వేరుగా ఈ నెల (ఆగష్టు) 29, 30 తేదీలో ఆఫ్లైన్ (వ్యక్తిగతంగా హాజరయ్యే విధానం)లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
రిక్వెస్టు బదిలీల ప్రాధాన్యత క్రమం:
- ఆ మొదట దివ్యాంగులకు, మానసిక వైక ల్యం ఉండే పిల్లలు కలిగిన ఉద్యోగు లకు రెండో ప్రాధాన్యత, గిరిజన ప్రాం తాల్లో కనీసం రెండేళ్ల పాటు పనిచే స్తున్న ఉద్యోగులకు మూడో ప్రాధా న్యత, ఆ తర్వాత ప్రాధాన్యతలుగా భార్య, భర్తలకు, పరసర్ప అంగీకార బదిలీలకు క్రమ పద్ధతిలో వీలు కల్పించనున్నారు.
- గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు, డిజి టల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఉద్యానవన అసిస్టెంట్లు, ఫిషరీస్ అసిస్టెంట్లు, వెటర్నరీ అసి స్టెంట్లు, మహిళా పోలీసు ఉద్యోగుల బదిలీలకు జిల్లా కలెక్టర్లు బదిలీల అధీకృత అధికారులుగా వ్యవహరిస్తారు. ఆ విలేజీ సర్వేయర్లకు సర్వే శాఖ ఏడీలు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్లకు వ్యవసాయ శాఖ జీడీలు, సెరికల్చర్ అసిస్టెంట్లకు జిల్లా సెరికల్చర్ అధికారులు, ఏఎన్ఎంలకు జిల్లా డీఎంహెచ్, ఎనర్జీ అసిస్టెంట్లకు డిస్కంల ఎస్ఈ ఆధీకృత అధికారులుగా వ్యవహరిస్తారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే ఇతర ఉద్యోగులకు సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు బదిలీల ఆధీకృత అధికారులుగా ఉంటారు.
- 50 ఏళ్ల లోపు వయస్సు ఉద్యోగులనే గిరిజన ప్రాంతాలకు బదిలీ చేస్తారు.
- ఆన్లైన్లో బదిలీకి దరఖాస్తు చేసుకుని, నిర్ణీత తేదీలో కౌన్సెలింగ్కు హాజరు కాని పక్షంలో ఆ ఉద్యోగి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.